👉రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై
పార్టీలలో తర్జనభర్జన!
👉ప్రధాని అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ తీర్మానాలు గోప్యం..
J. SURENDER KUMAR,
నూతనంగా నిర్మితమైన పార్లమెంటు భవనంలో మంగళవారం ప్రవేశపెట్టనున్న కొన్ని బిల్లులతో పాటు హైదరాబాదును దేశానికి రెండవ రాజధానిగా చేస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నారా ..? అనే చర్చ వివిధ జాతీయ ,ప్రాంతీయ పార్టీ నాయకులలో చర్చ మొదలైంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం రెండు గంటలపాటు జరిగిన కేంద్ర క్యాబినెట్ లో ఆమోదించిన అంశాలు సోమవారం రాత్రి పది గంటల వరకు ప్రచారం మాధ్యమాల్లో అధికారికంగా ప్రకటించలేదు. యూపీఏ హాయంలో జరిగిన ఆంధ్ర – తెలంగాణ విభజన ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకోలేదని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం, బిజెపి అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ మార్పు, తదితర అంశాల నేపథ్యంలో బీజేపీ గ్రాఫ్ తగ్గడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిజెపి పై ఆరోపణలు, తదితర నేపథ్యంలో హైదరాబాదును దేశానికి రెండవ రాజధానిగా చేస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్నారా ? అనే చర్చ కూడా నెలకొంది. దీనికి తోడు మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీ.హెచ్ విద్యాసాగర్ రావు , జూన్ మాసంలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి తెచ్చారు. ఇటీవల మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా మార్చే అవకాశాలున్నాయని, దేశానికి రెండో రాజధాని కావాలని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని అందరికీ గుర్తు చేశారు. భవిష్యత్‌లో హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా మారుతుందన్న విశ్వాసం నాకు ఉంది’’ అని విద్యాసాగర్‌రావు అన్నారు. దీనికి తోడు గత కొన్ని రోజుల క్రితం సాగర్ జి, ప్రధాని నరేంద్ర మోడీతో పార్లమెంటులో సమావేశమైన ఫోటోలు, ప్రచార మాధ్యమాల్లో అగుపించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ,సైతం ఇటీవల హైదరాబాద్ పర్యటనలో హైదరాబాద్‌ను దేశ రెండవ రాజధానిగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధిని సాధించడం,దీన్ని రెండవ రాజధానిగా ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ పెట్టుబడిని ఆకర్షించడం మరియు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడమే కాకుండా వ్యాపారాలు, వ్యవస్థాపకులు మరియు స్థానిక జనాభాకు కొత్త అవకాశాలను కూడా సృష్టించవచ్చు అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉండి ఉండవచ్చు.
రహదారి నెట్‌వర్క్‌లు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ అభివృద్ధి, స్థిరపడిన ప్రజా రవాణా వ్యవస్థ రాజధానిగా అనుబంధించబడిన పెరిగిన పరిపాలనా విధులకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. హైదరాబాదును భారతదేశానికి రెండవ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ పాతదే. గతంలో కూడా ఇలాంటి డిమాండ్లను పలువురు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వ్యక్తం చేశారు. ప్రచార మాధ్యమాల్లో వినిపిస్తున్న, అగుపిస్తున్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బిల్లుల వివరాల ఊహాగానాలు తోపాటు. హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధాని బిల్లును ప్రవేశపెట్టనున్నారో , లేదో వేచి చూద్దాం.