👉 పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న పాలకులు!
👉 సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి!
👉 దేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోయింది!
👉 IJU జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి!
J.SURENDER KUMAR,
దేశంలోనీ పాలకవర్గాలు జర్నలిస్టుల హక్కులను హరించి వేస్తున్నారని, దేశంలో పత్రికా స్వేచ్ఛ రోజు రోజుకి దిగజారి పోతుందని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని టీయూడబ్ల్యూజే యూనియన్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయ ల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం పత్రికల హక్కులను కాలు రాస్తున్నాయన్నారు. పాత్రికేయుల పై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. పోరుగు దేశం కంటే… మనదేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ లో
పాకిస్తాన్ లో జర్నలిస్టుల రక్షణ చట్టం ఉందని అన్నారు. మన దేశంలో అమలు జరగటం లేదని ఆరోపించారు. అక్టోబర్ రెండో తేదీన దేశవ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్లు సాధన, జర్నలిస్టుల రక్షణ దినంగా నిర్వహించనున్నట్టు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆగస్టు మాసంలో పాట్నాలో జరిగిన జాతీయ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేసినట్లు తెలిపారు.
రక్షణ కోసం డిమాండ్!
అక్టోబర్ రెండో తేదీన దేశవ్యాప్తంగా పాత్రికేయుల రక్షణ కోసం డిమాండ్ల సాధన కోసం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిందని ఆయన వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . దాని ఆధారంగానే అనేక చట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని వాటి ఆధారంగానే జర్నలిస్టులకు హక్కులు లభించినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా పాత్రికేయుల రక్షణ కోసం చట్టం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
టీవీ ఛానల్ లో చట్టాలు ఏర్పాటు చేయండి!
దేశవ్యాప్తంగా1000 వరకు వివిధ రకాల టీవీ ఛానళ్లు ఉన్నాయని తెలిపారు. అందులో 500 వరకు న్యూస్ చానల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేవలం పత్రికల్లో పని చేసే వారికి మాత్రమే చట్టాలు ఉన్నాయని వివరించారు. టీవీ ఛానల్ లో పనిచేసే వారికి ఎలాంటి చట్టాలు లేవని అందుకోసమే అన్నిటిని కలిపి చట్టాలు ఏర్పాటు చేయాలని కోరారు. మీడియా కౌన్సిల్, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా…
రాష్ట్రంలో హైదరాబాదులో ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆరోపించారు. పరోక్షంగా మరో నూతన సొసైటీని ఏర్పాటు చేసి పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు .తాను రెండు పర్యాయాలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి అనేక ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వాలకు పంపినప్పటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు వాటిని పక్కన పెట్టాయని ఆరోపించారు. రోజురోజుకీ పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలోకి పడిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పాత్రికేయుల రక్షణ కోసం చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు.
జర్నలిస్టు రక్షణ చట్టం ఆమోదించండి!
మహారాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం జర్నలిస్టుల రక్షణ కోసం చట్టం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా నీరుగార్చిందని ఆరోపించారు. ఇటీవల చత్తీస్గడ్ ప్రభుత్వం కూడా చట్టాలను చేసిందని తెలిపారు. జర్నలిస్టుల కోసం రక్షణ చట్టాలు పత్రికా స్వేచ్ఛ కాపాడడం కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
IJU అధ్యక్షుడికి ఘన స్వాగతం!

పట్టణంలో ముందుగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే, ఐజేయూ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డిని గజమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు, గన్న చంద్రశేఖర్, ఎల్లావుల రాములు , జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సభ్యులు నరేందర్, దీనుమకొండ శేషం రాజు ,దేవరం రామిరెడ్డి , బసవోజు శ్రీనివాసచారి, పిల్లల మర్రి శ్రీనివాస్, దేవరం వెంకటరెడ్డి ,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.