కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ట్రైలర్ మాత్రమే- సినిమా తెరపైకి తెస్తే….

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

J.SURENDER KUMAR,

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ట్రైలర్ మాత్రమే.. సినిమా తెరపైకి తెస్తే, కేసీఆర్ ప్రచారంలో ఉండడం అనుమానమే. సామాజిక తెలంగాణ నిర్మాణం దిశగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాలలో ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం లో మాట్లాడారు.

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తే.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను సీఎం కేసీఆర్ ఆమోదించారని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని 2014లో పెన్షన్ ₹1000 ఇస్తామని అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. 2018లో పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని రాయికల్లో జరిగిన ఓ సమావేశంలో పెన్షన్ ₹ 2000 ఇస్తామని తాను ప్రతిపాదించానని, అప్పటి మంత్రి కేటీఆర్ ₹.2000 పెన్షన్ ఎక్కడి నుండి ఇస్తారంటూ ఎద్దేవా చేసి, చివరికి కాంగ్రెస్ చూపిన బాటలో నడిచి పెన్షన్ ₹.2016 ఇస్తామన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నిరుద్యోగ భృతి ₹ 3000 ఇస్తామంటే బీఆర్ఎస్ ₹ 30016 ఇస్తామన్నారు.

ఉద్యోగ విరమణ వయసు 60ఏళ్లకు పెంచుతామంటే వాళ్లు 61 ఏళ్లు అన్నారు. పెన్షన్ వయసు 58 ఏళ్లు అంటే వాళ్లు 57ఏళ్లు అన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం ₹ 500లకు సిలిండర్ అంటే ₹.400 అంటున్నారు. అధికారంలో ఉండి కూడా ఇన్నాళ్ల నుండి సిలిండర్ ₹ 400 లకు ఎందుకు ఇవ్వలేదని  జీవన్ రెడ్డి ప్రశ్నించారు.


కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు కేసీఆర్ రాజముద్ర వేశారు. 2004-2014 మధ్య అర్హత ప్రాతిపదికన కుల,మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇల్లు కేటాయించామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో ఇల్లు కట్టుకునేందుకు ఒక్కరికైనా ఒక గుంట జాగా ఇచ్చారా ? అని కెసిఆర్ ను నిలదీశారు.

జగిత్యాలలో కాంగ్రెస్ పాలనలో సేకరించిన భూమిలోనే నేడు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారని అన్నారు.
వ్యవసాయ పెట్టుబడిని, పెరుగుతున్న ధరలను పరిగణలోకి తీసుకొని రైతు బందు ₹ 15000 ఇస్తామంటే కాంగ్రెస్ చెప్పింది నిజమే..మేము కూడా మెల్లగా ఇస్తామంటున్నారని అన్నారు.

2013-14లో తెలంగాణ ప్రాంత బడ్జెట్ ₹ 60వేల కోట్లు, ప్రస్తుతం ₹ 4లక్షల కోట్ల బడ్జెట్.. వరి ధాన్యానికి అదనంగా మద్దతు ధర ₹ 500 ఛత్తీస్గడ్ లో అమలు చేస్తున్నాం. సిలిండర్ ₹.500లకే రాజస్తాన్ లోఇస్తున్నాం. ఇల్లు లేని నిరుపేద వర్గాలకు ఇల్లు నిర్మించడం కాంగ్రెస్ ఆలోచన విధానం. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ గృహాలు నిర్మించినం. అర్హత ప్రాతిపదికన ఇల్లు లేనివారందరికి ఇల్లు కేటాయించినం. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు వయసుతో నిమిత్తం లేకుండ ప్రతి నెలా ₹ 2500 ఇస్తామని కాంగ్రెస్ చెబితే మేము కూడా ₹ 3000 ఇస్తామని కాంగ్రెస్ గ్యారంటీలకు కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు అని జీవన్ రెడ్డి అన్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధలైన నిరుద్యోగ, యువత, ఉద్యోగస్తుల గురించి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఒక్క మాటా అయినా చెప్పారా ?  జాబ్ క్యాలెండర్ ప్రకటించారా ? నిరుద్యోగ భృతిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ? నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మంత్రి కేటీఆర్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగస్తులు ఓపీఎస్ కావాలని ఉద్యమిస్తుంటే పదేళ్ల నుండి నిద్రపోయి ఇప్పుడు పరిశీలించటానికి కమిటీ వేస్తారట.. అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.