కళాశాల మైదానంలో సీఎం సభ జరగడం నిబంధనలకు విరుద్ధం !

J.SURENDER KUMAR,

ఎన్నికల యంత్రాలు భద్రపరచిన ధర్మపురి ప్రభుత్వ కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి సభ నవంబర్ 2న జరగడం సరికాదని ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల అధికారికి గత ఎన్నికలలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసిన వేముల విక్రమ్ రెడ్డి, దూడ మహిపాల్ శనివారం ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా మరింతగా దృష్టి సారించాలని నిబంధనలు అమలయ్యేలా అదేవిధంగా దీని పై పునరాలోచించాలి అనుమతి రద్దు చేయాలి లేదంటే ప్రత్యేక నిబంధనలు అమలయ్యేలా చూడాలని వారు కోరారు.