జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ !
J.SURENDER KUMAR,
గత 24 గంటలలో జరిపిన వాహనాల తనిఖీల్లో ₹15,67,380/- రూపాయలు నగదు, 254.87లిటర్స్ లిక్కర్ సీజ్ చేశామని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా పరిధిలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తునామని ఎస్పీ కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన 24 గంటలో జిల్లా పరిధిలో వాహనాల తనిఖీల్లో మొత్తం ₹ 15,67,380/- రూపాయలు, 254.87లిటర్స్ విలువ గల లిక్కర్ సుమారుగా అంచనా విలువ ₹ 1,08,654/-రూపాయలు, ఇతర వస్తువులు 1078 చీరలు, 200, షర్టులు 132, హ్యాండ్ బ్యాగ్స్ 40, హాట్ బాక్స్ 270 సుమారుగా అంచనా విలువ ₹ 7,57,670/- పట్టుకొని జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా పరిధిలో ఎవరైన ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే రసీదు, తగిన పత్రాలు వాటి వివరాలు ఉండాలని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం ప్రకటనలలో ఎస్పీ పేర్కొన్నారు.