J.SURENDER KUMAR,
ఎన్నికల గుర్తులపై భారత్ రాష్ట్ర సమితి (BRS ) వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు లో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్ తో కూడిన సుప్రీం ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.
రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులు రద్దు చేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్‌పై . సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లు.. గుర్తులకు తేడా తెలియనంత నిరక్షరాస్యులు కాదని పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ ఇచ్చాకే ఇలాంటివి గుర్తుకొస్తాయా ? అని అడిగింది. ఇలాంటి పిటిషన్లతో ఎన్నికల వాయిదా కోరుకుంటున్నారా ? అని న్యాయస్థానం ప్రశ్నించింది.
.హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌పై ఆలస్యంగా వచ్చారని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అధికార పార్టీగా ఉండి 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారని ప్రశ్నించింది. పిటిషన్‌ను విచారించడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
దీనిపై హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. మెరిట్స్ ఆధారంగానే హైకోర్టు విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.