రాముడికి లక్ష్మణుడు తోడు నాకు వంశి తోడు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


శ్రీ రామచంద్రమూర్తి కి  లక్ష్మణుడు తోడుగా ఉన్నట్టు.. ఈ

ప్రాంత అభివృద్ధి కోసం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి

గడ్డం వంశి నాకు తోడుగా ఉంటూ చేయూత ఇస్తాడని

ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అన్నారు.


ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం మండల కేంద్రాలలో ఆదివారం జరిగిన  పెద్దపెల్లి పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశంలో  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఎంపి అభ్యర్థి వంశీ  పాల్గొన్నారు. 

కార్యక్రమానికి ముందు స్థానిక శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బైకు ర్యాలీ, మేళ తాళాలతో  ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎంపీ అభ్యర్థి వంశీని  కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ…
బి.అర్.ఎస్, బీజేపీ పార్టీకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తర్జనభర్జన చేసీ రాజకీయ కుటుంబ నేపథ్యం  ఉన్న  వంశీ నీ పెద్దపెల్లి పార్లమెంట్ ఎంపి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందన్నారు.

రాముడికి లక్ష్మణుడు తోడుగా ఉన్న విధంగా తనకు తోడుగా మన ముందుకు వంశి వచ్చాడన్నారు.
మన  గోదావరి నీళ్ళు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కి తీసుకెళ్తున్న అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్  స్పందించలేదని, కాళేశ్వరం లింక్ 2 పేరుతో, వేల ఎకరాల రైతుల భూములు  లాకున్న కొప్పుల ఈశ్వర్ అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ను  కలిసి ఇక్కడి రైతుల పరిస్థితి గురించి అడిగారా ? అని, లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.


ఈ ప్రాంతానికి నీళ్ళు అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి  దగ్గరికి  వెళ్లి సాగు నీళ్ళు తెచ్చుకున్నామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.


10 సంవత్సరాలు క్రితం కొప్పుల ఈశ్వర్ ఏ విధంగా ఈ ప్రాంతానికి వచ్చాడో,  ఇప్పుడు వేల కోట్లకు ఎలా ఎదిగాడో చెప్పాలని, లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమాలలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు  తదితరులు పాల్గొన్నారు