J.SURENDER KUMAR,
వరి ధాన్యం కొనుగోలు రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, తాలు తప్ప పేరిట ఎటువంటి కటింగ్ లేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
వెల్గటూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సంఘ భవనం మరియు గోదామును శుక్రవారం పొనుగోటి శ్రీనివాస్ మరియు మండల నాయకులతో కలిసి, ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన నూతన సంఘ భవనం మరియు గోదాము ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

గత ప్రభుత్వంలో పాలకులు రైతుల గురించి కనీసం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పూర్తిగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మరి ధాన్యం కొనుగోళ్ళు కొనసాగించడం జరుగుతుందని, ఎవరికైనా ₹ 2 లక్షల రూపాయలు రుణ మాఫీ కాలేదో వారు అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తామని, అదే విధంగా అర్హులైన పేదవారికె ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు.