సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లక్ష్మణ్ కుమార్!

J SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాదులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.

గత దశాబ్ద కాలంకు పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మూసుకొని  ధర్మపురి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేసిన సీఎం ను కలసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు.. మీ రుణం తీర్చుకోలేనిది, వ్యక్తిగతంగా, ధర్మపురి అసెంబ్లీ ప్రజల పక్షాన, కృతజ్ఞతలు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.