👉 మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం 2 అభ్యర్థులకు ఏఎస్ డబ్ల్యూ ఓ లుగా నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో….
👉 మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా విజన్ ఉన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా పరిపాలన కొనసాగిస్తున్నారని, సీఎం అవలంబిస్తున్న ఫ్రెండ్లీ గవర్నమెంట్ పరిపాలనకు అనుగుణంగా ఉద్యోగులు పని చేయాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మణ్ లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గ్రూప్ 2 పోటీ పరీక్షల్లో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులుగా నియమితులైన అభ్యర్థులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లోని ఎస్సీ డెవలప్మెంట్ అభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయంలో మంగళవారం నియామక పత్రాలను అందించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక వేలాది మంది కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వేలాదిమంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందించారని, మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ముఖ్యమంత్రి విజన్ ఉన్న నాయకుడని, ఆయన ఆలోచనలకు తదనుగుణంగా అధికారులు పనిచేయాలని గ్రామీణ ప్రాంతాలలో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమ కోసం క్రమశిక్షణతో పనిచేసే మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి ఉద్యోగ పత్రాలు అందుకున్న వారికి సూచించారు.
👉 విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి శ్రమిస్తే మీరు ఈ స్థాయికి వచ్చారని, మంచి పాలన అందించి ప్రభుత్వానికి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మంత్రి అన్నారు. మీరు హాస్టల్ విద్యార్థులకు మంచి వసతి విద్యను అందించి మంచి భవిష్యత్తును ఇవ్వాలని మంత్రి కోరారు.
👉 ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ…

.
మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవ తో గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీం (బిఏఎస్) పథకానికి సంబంధించిన 25 శాతం నిధులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇప్పించారని అభినందించారు.
👉 హాస్టల్ విద్యార్థులకు 40% చార్జీలను 200 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని, సహకరించిన మల్లు భట్టి విక్రమార్కకు, మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
👉 మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ఏఎస్డబ్ల్యూఓ అధికారులకు అభినందనలు తెలిపారు.
👉 ఎస్సీడిడి సెక్రెటరీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ….
ఏఎస్డబ్ల్యూ ఓ అధికారులు గా నియమితులైన వారందరూ వృత్తి రీత్యా సామర్థ్యాలను పెంపొందించుకోవాలని, హాస్టల్ విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని, ఇంతటితో ఆగకుండా గ్రూపు 1 అధికారులుగా రాణించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎస్సిడిడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్, తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఎస్ సి డి డి కమిషనర్ కార్యాలయ అడిషనల్ డైరెక్టర్ సి.శ్రీధర్ స్వాగతం పలుకగా, జాయింట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి వందన సమర్పణ చేశారు. ఏ ఎస్ డబ్ల్యూ ఓ లుగా నియమితులైన వారికి ఈ సందర్భంగా మంత్రి నియామక పత్రాలు అందజేశారు.

అనంతరం నూతనంగా నియమితులైన గ్రూప్ 2 అధికారులు మంత్రికి గారికి శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపి మంత్రి ఆశీస్సులను తీసుకున్నారు.