👉 ప్రజలకు సేవాచేసే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించండి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
తెలంగాణ యాస, భాష తో పాటు మరో మారు అబద్ధాలు చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవాలనే కుట్రలు  చేస్తున్నవారికి తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ ఉప  ఎన్నికల ప్రచారంలో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  నవీన్ యాదవ్ గెలుపుకు మద్దతుగా  ఆదివారం నియోజకవర్గ పరిధిలో సోమాజిగూడ డివిజన్ లో ఉషా ఎంక్లైవ్ లో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్  ఠాకూర్ , మేడిపల్లి సత్యం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డీ, మాజీ ఎమ్మెల్యే కె . లక్ష్మారెడ్డి, మూడ చైర్మన్ కీస వేణు, లైబ్రరీ చైర్మన్ డా.రియాజ్ స్థానిక కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్, తదితరులు ప్రచారం నిర్వహించారు.

👉 ప్రచారంలో మంత్రి లక్ష్మణ్ కుమార్, ఓటర్లను అభ్యర్థిస్తూ…
గతంలో  ఓడిన మీ మధ్య ఉంది సేవ చేస్తున్న నవీన్ యాదవ్ ను గెలిపించాలని మంత్రి ఓటర్లకువిజ్ఞప్తి చేశారు. గత పది సంవత్సరాల బిఆర్ఎస్ హయంలో  ప్రజలను అనేక ఇబ్బందుల గురిచేసి మళ్లీ మరోసారి మోసం చేసేందుకు వచ్చే నాయకులకు బుద్ధి చెప్పాలని మంత్రి  ఉషా ఎంక్లైవ్ సొసైటీ వాసులను కోరారు.
మీకు ఏ కష్టం, ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ ద్వారా తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే మూడేళ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గన్నీ అన్ని విధాలుగా తీర్చి దిద్దేందుకు గాను నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని మంత్రి కోరారు. పది సంవత్సరాల కాలంలో మంత్రులను, సామాన్య ప్రజలు కలిసే అవకాశం కల్పించలేని బిఆర్ఎస్ నాయకులు తిరిగి ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నారని మంత్రి నిలదీశారు.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా మంత్రులు అలాగే ప్రజలకే సమస్య వచ్చిన వారి ఫిర్యాదులను స్వీకరించినందుకు ప్రజాభవంలో ఏర్పాటు చేశామని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.

 
													