ఎస్.ఐ.ఆర్. జాబితా పకడ్బందిగా తయారు చేయాలి!

👉 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి !

J SURENDER KUMAR,

ఎస్.ఐ.ఆర్. ఓటర్ జాబితా పకడ్బందిగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు.శనివారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై జిల్లా కలెక్టర్ల తో రాష్ట్ర ఎన్నికల సంఘం సీ.ఈ.ఓ సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..

ఎస్.ఐ.ఆర్.  నిర్వహణ కోసం చేపట్టిన ప్రిపరేటరీ కార్యాచరణలో పురోగతి ఉండాలని, 2002 లో చేసిన ఎస్.ఐ.ఆర్. తో 2025 స్పెషల్ సమ్మరీ రివిజన్ ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బూత్ స్థాయి అధికారుల సహకారం తీసుకొని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

ఎస్.ఐ.ఆర్. నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్. డేటాను 2025 ఎస్.ఐ.ఆర్. డేటా తో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్ర స్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.

👉 వీడియో కాన్ఫరెన్స్ లో
జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ

జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎస్.ఐ.ఆర్. మ్యాపింగ్ లో భాగంగా క్యాటగిరి ‘ఏ’ ని బి.ఎల్.ఓ. యాప్ ద్వారా ధృవీకరిస్తామని, క్యాటగిరి సి, డి లింక్ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. ఈ.ఆర్.ఓ. కార్యాలయంలో ఇద్దరు బూత్ స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి శనివారం నాటికి మ్యాపింగ్ పూర్తి చేస్తామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో  మెట్ పెల్లి, కోరుట్ల ఆర్డీవోలు శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.వో హకీమ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.