నరసింహుడి కి తలంబ్రాలు సమర్పించిన కలెక్టర్ దంపతులు!

👉 పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అధికారులు పాలకవర్గం !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జగిత్యాల జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై స్వామివారికి  ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను  ఆశీర్వదించి స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ మాట్లాడుతూ.

బ్రహ్మోత్సవాల సందర్భంగా  ప్రజలందరికీ ఆధ్యాత్మిక శాంతి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరియు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్య ఆశీస్సులు జిల్లా ప్రజలందరికి కలగాలని ఆకాంక్షించారు


బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, శానిటేషన్, పారిశుద్ధ్య నిర్వహణ  నిరంతరం చేపట్టాలని, భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని సురక్షిత త్రాగునీటి సౌకర్యం సమృద్ధిగా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులు సమన్వయంతో పని చేస్తూ భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు

ఈ కార్యక్రమంలో ఆర్డీవో, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు, దేవస్థాన కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్,  దేవస్థాన ఈవో, తహసీల్దార్ లు, ఎంపిడివోలు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.