పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 అంగరంగ వైభవంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి లక్ష్మణ్ కుమార్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 

పవిత్ర గోదావరి నది తీరంలో గోధూళి సుముహూర్తం లో వేద బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు.

స్థానిక మున్సిపల్ పక్షాన స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను  మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ మామిళ్ళ శ్రీనివాస్ రావు కౌన్సిలర్లు పాల్గొన్నారు.