J SURENDER KUMAR,
పుణ్యక్షేత్రమైన ధర్మపురి లో శ్రీమఠం పీఠాధిపతి ఇటీవల సిద్ధి పొందిన శ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు అందించిన సహకారంను మంత్రి లక్ష్మణ్ కుమార్ జ్ఞాపకం చేసుకుంటూ స్వామివారికి నివాళులర్పించారు..
గతంలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై జాతర ఉత్సవాలలో స్వామివారి కళ్యాణం నిర్వహించే వారు.. స్థలం ఇరుకుగా ఉండటంతో స్వామి వారి కల్యాణానికి పరిమితం సంఖ్యలో భక్తులకు అనుమతి ఇచ్చేవారు..

దేవదేవుని కల్యాణం రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చే వేలాదిమంది భక్తులు తిలకించడానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ గత సంవత్సరం స్థానిక అగ్రహారం పెద్దలతో పాటు తుని పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వాములవారి శ్రీ మఠం మైదానంలో స్వామి వారి కళ్యాణం నిర్వహించుకోవడానికి మౌఖిక అనుమతి పొందారు..
గత సంవత్సరం స్వామివారి ఆశీస్సులతో గోదావరి తీరంలో కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు..శనివారం జరిగిన స్వామివారి కళ్యాణానికించడానికి దాదాపు పదివేల మందికి పైగా భక్తజనం ఈ ప్రాంగణానికి తరలివచ్చారు.

ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. సిద్ది పొందిన తుని స్వామి వారు ఆశీస్సులతో అనుమతించిన వారి శ్రీ మఠం మైదానంలో లక్ష నరసింహ స్వామి వారి కళ్యాణం దేవాదాయ శాఖ వారు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి, వేలాదిమంది భక్తజనం స్వామివారి కల్యాణ మహోత్సవం లాంటి ఇబ్బందులు లేకుండా చూసే భాగ్యం కల్పించిన స్వామివారికి మంత్రి నివాళులర్పించారు.
