👉 కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ !
J.SURENDER KUMAR,
మనకు మంచి మనసున్న నాయకుడు మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నారని అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్ లో
బుధవారం జరిగిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అవగాహన మరియు శిక్షణ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, మెట్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్ లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ వసంత, రాయికల్ మున్సిపల్ చైర్మన్ , కలెక్టర్ సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ….
పార్టీలు , జెండాలు వేరైనా అభివృద్ధి ఎజెండాగా పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంచి మనస్సున్న నాయకుడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయాలని, కొత్త ఎన్నికైన నేతలు హక్కులు, బాధ్యత తెలుసుకోవాలని శిక్షణకు హాజరైన చైర్మన్లు కౌన్సిలర్లు, సర్పంచులకు ఎమ్మెల్యే సంజయ్ విజ్ఞప్తి చేశారు.
