పంచాయతీ భవనం  ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ధర్మపురి  నియోజకవర్గం వెల్గటూర్ మండలం ముక్కట్రావ్ పేట గ్రామపంచాయతీ  కార్యాలయాన్ని భవనాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.

₹.22.50 లక్షలతో  నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని  ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందించడానికి ఉపయోగపడాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులు మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో తాగు నీటి సమస్యతో పాటు అన్ని సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.