👉 జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు ఘన స్వాగతం !
👉 ఎస్సీ సంక్షేమ పథకాలపై కీలక చర్చ.!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR
ఎస్సీ వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. భారత ప్రభుత్వ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ (NCSC) గౌరవ చైర్మన్ కిషోర్ మక్వానా సోమవారం తెలంగాణ పర్యటన సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఆత్మీయ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, సామాజిక సాధికారతకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న కార్యక్రమాలపై, ఎస్సీ సంక్షేమ పథకాలపై ఇరువురు కీలక చర్చలు విస్తృతంగా చర్చించారు.


సామాజిక న్యాయం, సంక్షేమ ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా ఉమ్మడి కృషి కొనసాగాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచేలా మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
