ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న
హైకోర్టు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి దంపతులు!

J. SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ జువ్వాడి శ్రీదేవి దంపతులు కుటుంబ సమేతంగా ఆదివారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభం, మేళతాళాలు, వేదమంత్రాలు అర్చకులు వేద పండితులు అధికారులు జస్టిస్ దంపతులు స్వాగతించారు. పూజల అనంతరం అర్చకులు, వేద పండితులు ఆశీర్వాద మండపంలో వారికి స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదం, అందించి సన్మానించారు.

దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ,దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , పాలెపు ప్రవీణ్ కుమార్, ముఖ్య అర్చకులు రమణయ్య, రెనవేషన్ కమిటి సభ్యులు అక్కనపల్లి సురేందర్ వేముల నరేష్ ఇనగంటి రమ వెంకటేశ్వరరావు వేముల నరేష్ గందె పద్మ శ్రీనివాస్ , చుక్క రవి , పల్లెర్ల సురేందర్, స్థంభంకాడి మహేష్ , గునిశెట్టి రవీందర్, సంగెం సురేష్ పాల్గొన్నారు.

జస్టిస్ జువ్వాడి శ్రీదేవికి, గాడ్ ఆఫ్ ఆనర్ !

నరసింహ స్వామి దర్శనం కోసం ధర్మపురి వచ్చిన హైకోర్టు జస్టిస్ శ్రీదేవికి, ఆలయ ముందు ప్రభుత్వం గౌరవప్రదంగా,నిబంధనల మేరకు గార్డ్ ఆఫ్ ఆనర్ వారి వందన స్వీకారం అనంతరం ఆలయ అధికారులు సాంప్రదాయ జస్టిస్ శ్రీదేవి నీ స్వాగతించారు.

జస్టిస్ ను సన్మానించిన మున్సిపల్ చైర్ పర్సన్!

ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు జువ్వాడి సూర్యారావు, తనయ హైకోర్టు న్యాయమూర్తి హోదాలో మొదటిసారి ధర్మపురికి విచ్చేసిన సందర్భంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, కలిసి ఘనంగా సన్మానించారు.