J.Surender Kumar
మహిమాన్విత గల కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దొంగతనంకు పాల్పడిన ముఠా సభ్యుల. స్థావరం ను పోలీసు జగిత్యాల పోలీసులు ఆదివారం తెల్లవారుజామున చుట్టుముట్టినట్టు సమాచారం.
శుక్రవారం తెల్లవారుజామున కొండగట్టు ఆలయ దొంగతనం వెలుగు చూడడంతో జగిత్యాల పోలీసులు పది బృందాలుగా వేటాడం ప్రారంభించారు. ఇతర రాష్ట్ర సరిహద్దు లోకి ముఠా సభ్యులు చేరుకోకముందే జగిత్యాల్ పోలీస్ లు వారి స్థావరం కు పది కిలోమీటర్ల చుట్టూ రౌండ్ అప్ చేసినట్టు సమాచారం. పోలీసులు తమ.చుట్టూ మాటు వేశారనే సమాచారం తెలియకుండానే దొంగలు తమ స్థావరానికి చేరుకోగానే . తమను పోలీసులు నీడలా డేగ కన్నులతో వెంటపడుతున్నారనే సమాచారం తెలిసిన ముఠా సభ్యులకు వారి సన్నిహితులు సమాచారం ఇవ్వడంతో. దొంగలు ఉక్కిరి బిక్కిరి అవుతూ తప్పించుకునే యత్నంలో ఉన్నట్టు సమాచారం. పోలీసులు పక్క సమాచారాలతో గీసిన స్కెచ్ నుంచి తప్పించుకునే అవకాశమే లేనట్టు తెలిసింది.
జగిత్యాల్ పోలీసులే పట్టుకుంటారా ? ఆ రాష్ట్ర అదనపు పోలీస్ బలగాల సహాయం కోరుతారా.,? కొన్ని గంటల్లో తేలిపోతుంది.