వదంతులను నమ్మకూడదు !
పీస్ కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ,!
J. Surender Kumar,
జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని గురువారం పండుగ ఏర్పాట్లపై పోలీస్ , మున్సిపల్, వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు, నాయకులు తో కలెక్టర్ , ఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….. శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ మాసంలో చేయవలసిన ఏర్పరట్ల గురించి వివిధ శాఖల అధికారుల కు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సమయంలో మసీదుల వద్ద పరిశుభ్రంగా ఉండేలా సానిటేషన్ పనులు చేయాలని త్రాగునీరు అందుబాటులో ఉంచాలని వీధి దీపాలు వెలిగేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కరెంటు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు ను ఆదేశించారు.

శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకూడదు అని తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…… పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగను నిర్వహించుకోవలని, అన్ని కులాల మతాల పండుగ పర్వదినాలను శాంతియుతంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, మత సామరస్యం గురించి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు. శాంతి భద్రతలు అదుపులో వుంటెనే అబివృద్ది జరుగుతుంది అని తెలిపారు. ముఖ్యంగా మత సామరస్యానికి ప్రతీకగా జిల్లా వుందని జిల్లా పరిధిలో అన్ని మతల కులాల వారు సోదర భావంతో మెలగడం మంచి సంప్రదాయమన్నారు, రంజాన్ పండుగ నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకూడదని అట్లాంటి వాటి పై వెంటనే పోలీసువారికి తెలుపాలని సూచించారు, పట్టణలలో గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగింది పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. మసీదు ల వద్ద పటిష్టమైన చర్యలు చేపట్టడం తో పాటు నమాజ్ ఈ టైంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని అదికారులను ఆదేశించడం జరిగినదని తెలిపారు.

ఈ సందర్బంగా వివిధ మత పెద్దలు మాట్లాడుతూ కలెక్టర్ , ఎస్పీ ఆదేశాలను,వారు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యకు తమ వంతు సహకాహరం అందజేయడంతో పాటు, ఆన్ని మతాలవారి తో తమ పండుగను కల్సి శాంతియుత వాతావరణంలో నిర్వహించుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు మాధురి, వినోద్ కుమార్, డీఎస్పీలు ప్రకాష్, రవీంద్రారెడ్డి వివిధ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు ,పోలీస్ ఇన్స్పెక్టర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.