మావోయిస్టు కొరియర్లు, మీలేషియా సభ్యులు అరెస్ట్ !

ఎస్పీ డాక్టర్ వినీత్ !


J. SURENDER KUMAR,

మావోయిస్టు పార్టీ కొరియర్లు, మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుమ్ముగూడెం మండలం, ములకలపల్లి అటవీ ప్రాంతంలో దుమ్ముగూడెం పోలీసులు 141 బీఎం సిఆర్పిఎఫ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు సంయుక్తంగా సోమవారం నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో పదిమంది అనుమానితుల్ని పట్టుకొని విచారించగా అందులో ఐదుగురు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ కొరియర్లు కాగా, మిగిలిన ఐదుగురు నిషేధిత మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులుగా నిర్ధారణ అయిందని ఎస్పీ తెలిపారు.

అరెస్ట్ చేసిన వారిలో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ కొరియర్లు జున్ను కోటి, ఆరేపల్లి శ్రీకాంత్, మేకల రాజు, చిలివేరు రమేష్, తాళ్లపల్లి ఆరోగ్యం కాగా మిగిలిన వారు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు ముసికి రమేష్, ముసికి సురేష్, బాడిస లాలు, సోడి మహేష్, మడివి చేతు ఉన్నట్టు తెలిపారు. వీరి వద్ద నుండి కార్డెక్స్ 90 బండిల్స్, డిటార్డినేటర్లు 500, స్లర్రి స్టిక్స్ 600, ఒక బొలెరో వాహనం, ట్రాక్టర్, మోటార్ సైకిళ్లు రెండు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల ఆదేశానుసారం పోలీస్ క్యాంపు ల పైన, కూంబింకు వచ్చే పోలీసుల పైన దాడులు చేయడానికి అవసరమైన ల్యాండ్ మైండ్లు, ఐఇడీలు, రాకెట్ లాంచర్ల తయారీకి ఉపయోగపడే ప్రేలుడు పదార్థాలను మావోయిస్టు కొరియర్లు బొలెరో వాహనంలో దుమ్ముగూడెం మండలం ములకలపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకొని వచ్చి మావోయిస్టు పార్టీ మీలేషియా సభ్యులు తీసుకువచ్చిన ట్రాక్టర్ లోకి లోడ్ చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఈ కేసులో మావోయిస్టు పార్టీ కొరియర్లకు పేలుడు పదార్థాలు సరఫరా చేసిన వ్యక్తులపై, లైసెన్స్ సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఇలాంటి ఖరీదైన పేలుడు పదార్థాలను కొనుగోలు చేయడానికి నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో ? దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు, కాంట్రాక్టర్లు, రైతులను బెదిరిస్తూ పోలీసు వారిని హతమార్చడానికి, అభివృద్ధి పనులకు ఉపయోగించే మిషన్లను దహనం చేయడానికి ఈ పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ప్రేలుడు పదార్థాల వ్యాపారం చేస్తున్నవారు నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పేలుడు పదార్థాలు సరఫరా చేయవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా సరఫరా చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికైనా నిషేధిత మావోయిస్టుకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.