మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J.SURENDER KUMAR,
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు అనుక్షణం అండగా ఉంటుందని. మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జగిత్యాల జిల్లా పరిషత్తు ప్రత్యేక సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ,

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి తొలి, మలి దశల్లో ఎంతో మంది అమరులైనారని, ఆనాటి ఉద్యమ ఫలితమే ఈ నాటి తెలంగాణ రాష్ట్ర మని అన్నారు. రాష్ట్రంలోని తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని, తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలుపరుస్తున్నదని అన్నారు. విద్య, వైద్యం, సాగునీరు, మిషన్ భగీరథ, ఉచిత విద్యుత్తు, హరితహారం వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వివరించారు. శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నారు తెలిపారు.

శాసన మండలి సభ్యులు ఎల్.రమణ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం ఆడుకోవడం జరిగిందని, ఆనాటి పోరాటాలను ఆయన గుర్తుచేశారు. జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, స్వరాష్ట్రం కోసం అమర వీరులను స్మరించుకోవడం జరుగుతున్నదని, అన్నారు.. అమరులకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఘనంగా నివాళులు అర్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, అమరవీరులకు నివాళులు అర్పించడం, వారి త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని అన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆడుకోవడం జరిగిందని తెలిపారు. 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం జరిగిందని తెలిపారు.
అనంతరం సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా 36 మంది అమరవీరుల కుటుంబాలను శాలువా, మెమెంటో లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్లు మంద మకరంద, బి.ఎస్. లత, జెడ్పీ సీఈఓ రామానుజ చారి, జెడ్పీటీసీ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.