దశాబ్ది ఉత్సవాలు కాదు.. దశాబ్ది దగా ఇది- పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!


J.SURENDER KUMAR,


తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ, ప్రజల సొమ్ముతో వేడుకలు చేస్తున్నారని, దశాబ్ది ఉత్సవాలు కావు ఇవి, దశాబ్ది దగా ఇది అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు
దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా దశాబ్ది దగా అనే కార్యక్రమం జగిత్యాల పట్టణంలో గురువారం జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వగృహం ఇందిరా భవన్ నుండి కాంగ్రెస్ జెండాలు పట్టుకొని శ్రేణులు ర్యాలీగా స్థానిక తహసీల్ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.


ధర్మపురిలో భారీ ర్యాలీ..


జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మపురి లోని స్థానిక నంది విగ్రహం నుండి ర్యాలీగా గాంధీ విగ్రహం మీదుగా ఎమ్మార్వో ఆఫీస్ కి చేరుకొని ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి తహాసిల్దార్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు.


ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
2014 లో ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి ఆలయ అభివృద్ధికి ₹ 500 కోట్లు ఇస్తామని ప్రకటించారని ఇప్పుడు ఆ హామీ ఏమైందని, లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ మోసపూరితమైన హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని, మిల్లర్లు ఇష్టారీతిన కటింగ్ పేరిట రైతుల కష్టాన్ని దోచుకుంటుంటే ఎంత మంది మిల్లర్ల పైన మంత్రి కొప్పుల ఈశ్వర్ చర్యలు తీసుకున్నారని, రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా రైతులే స్వయంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ముందు వడ్లు పోసి నిరసన తెలిపారని లక్ష్మణ్ కుమార్ అన్నారు.


సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తరహాలో ధర్మపురి అభివృద్ది ఎందుకు జరగడం లేదో మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పాలని, మాట్లాడితే జీవన్ రెడ్డి విమర్శిస్తూ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసురుతూ తీరా సవాల్ ని స్వీకరించి సమయం , తేదీ చెప్పాలని జీవన్ రెడ్డి సవాలు విసిరితే ఇప్పటి వరకు స్పందన లేదని లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగన బట్ల దినేష్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, పెగడపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్1 అద్యక్షులు కుంట సుధాకర్, నియోజకర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్,

ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందెని మొగిలి, వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూదరి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్ , వెల్గటూర్ గ్రామ సర్పంచ్ మురళి, ఇస్రాజ్ పల్లె సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ,పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..