J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి కేవలం 75 రోజులలోనే ఒక కోటి 15 లక్షల 53 వేల, 532 రూపాయలు ( 1,15,53,532 ) హుండీ ఆదాయం లభించినట్టు ఆలయాధికారులు తెలిపారు.

బుధవారం ఆలయ ప్రాంగణంలో భారీ బందోబస్తు, నిఘా నీడలో, దేవాదాయ ఉన్నతాధికారులు, భక్తుల, పోలీసుల సమక్షంలో హుండీలు లెక్కించారు. 27 గ్రాముల మిశ్రమ బంగారం, 4.800 గ్రాముల మిశ్రమ వెండి, 70 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలో లభ్యమైనట్టు ఆలయ అధికారులు జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.