తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో..
J. SURENDER KUMAR,
ప్రభుత్వం తక్షణమే బదిలీలు పదోన్నతుల కు చర్యలు చేపట్టాలని
317 జీవో ద్వారా నష్టపోయిన ఉద్యోగులకు సూపర్ న్యూమరి పోస్టులు క్రియేట్ చేసైనా వారికి ఆ పోస్టులను కేటాయించాలని తపస్
రాష్ట్ర అకాడమిక్ కన్వీనర్ రొట్టె శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ధర్మపురి మండలంలో బుధవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కన్వీనర్ రొట్టె శ్రీనివాస్ మాట్లాడుతూ
కేంద్రం ఇచ్చిన 57వ మెమో ద్వారా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఓపిఎస్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదులో జిల్లా బాధ్యులు బండి మహేష్, కాశెట్టి రమేష్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాశేట్టి శ్రీనివాస్ , దావనపల్లి రమేష్, బండి ప్రవీణ్ , బి. శ్రీనివాసరావు, బక్క శెట్టి రవీందర్, గడిపల్లి కిరణ్ , బుగ్గారపు హరీష్ తదితరులు పాల్గొన్నారు