నామినేషన్ ఒక్కటే.. ఓట్లు రెండు..?

👉ఖమ్మం పార్లమెంటు స్థానానికి..

J.SURENDER KUMAR,

ప్రతి ఓటరు రెండు చోట్లలో ఓటు కలిగి ఉండడం నేరం  అంటూ, ఎన్నికల సంఘం పదే పదే చేస్తున్న ప్రకటనలకు  ప్రాధాన్యత కరువైంది.

వివరాలు ఇలా ఉన్నాయి..

ఖమ్మం పార్లమెంటు స్థానంకు  జాతీయ రాజకీయ పార్టీ అభ్యర్థి ఒకరు  ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటు హక్కు కలిగి ఉన్నట్టు  రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫిడివేట్ లో (19/04/2024 ) పేర్కొన్నారు.  అభ్యర్థి పేరు ఓటర్ లిస్టు చేర్పులలో..
అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ బ్లాక్ 15, ఓటర్ క్రమ సంఖ్య 85.. గా పేర్కొన్నాడు. EPIC No.1870… గా నమోదయి ఉంది.

అభ్యర్థి సమర్పించిన అఫిడెవెట్.


అయితే ఈ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటు కలిగి ఉన్నారు.  క్రమ సంఖ్య 93..  EPIC No.1870…పోలింగ్ బూత్ నెంబర్ 35.. కొండాపూర్  ఈ మేరకు మే 13న ఓటుకు వినియోగించడానికి స్లిప్పు కూడా సిద్ధమైంది.

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి లో ఓటరున్నట్టు ఇన్ఫర్మేషన్ స్లిప్


రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి ఓటర్ లిస్టులో పేర్లు తొలగింపు, చేర్పులలో  ఈ అభ్యర్థి పేరు తొలగింపబడలేదు.
ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన కొందరు జాతీయ పార్టీ అభ్యర్థి రెండు చోట్ల ఓటు కలిగి ఉండి  రిటర్నింగ్ అధికారికి తప్పుడు సమాచారంతో నామినేషన్ దాఖలు చేశారు అంటూ   ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు సమాచారం.