సీఎం రేవంత్ రెడ్డిని  కలిసిన వివిధ దేశాల ప్రతినిధులు !


J.SURENDER KUMAR,


హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ -2026లో పాల్గొనడానికి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ముఖ్యమంత్రి ని కలిసి తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు.

👉 ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మలేషియా పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ ఎం. శరవణన్ , అమెరికాకు చెందిన బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ బోర్డు డైరెక్టర్ నిలి గిల్బర్ట్, అమెరికా వాణిజ్య శాఖ మూమెంటమ్ టెక్నాలజీస్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మహేష్ కొండూరు , ఓక్సన్ టెక్నాలజీస్, గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ కో-చైర్ అమిత్ మెహ్రా , నార్వే ప్రభుత్వ మాజీ స్టేట్ సెక్రెటరీ, ఓషన్ హౌస్ గ్లోబల్ స్ట్రాటజీస్ సలహాదారు దిలెక్ అయహన్ , దక్షిణాఫ్రికా పార్లమెంట్ సభ్యుడు థామస్ ప్రోలిక్ , సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు సెంథిల్ తొండమాన్  ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఉన్నారు.


👉 ఈ ప్రతినిధి బృందంతో జరిగిన భేటీలో ప్రధానంగా పర్యావరణం, సామాజిక, పరిపాలనా పరమైన అంశాలతో పాటు మౌలిక సదుపాయాలు, ఏఐ వినియోగం, భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది.


👉 ఈ సమావేశంలో గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్ నిర్వహిస్తున్న మెరీడియన్ కలెక్టివ్ ప్రతినిధులు రిత్వికా భట్టాచార్య , ఉమా భట్టాచార్యతో పాటు లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.