J . SURENDER KUMAR,
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ పాల్గొన్నారు. ఇటీవల నూతనంగా ఏర్పాటైన ఈ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
👉 ఈ సమావేశంలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు చైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డి , బోర్డు సభ్యులైన ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి , శ్రీమతి కొణిదెల సురేఖ , శ్రీమతి విజయ రాజం , శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ , డాక్టర్ మల్లయ్య , శ్రీమతి స్వాతి కాంతమనేని , ఎం. రాఘవేందర్ రావు , డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా యాదగిరిగుట్ట క్షేత్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనపై నూతన పాలక మండలికి ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
