ధర్మపురి నరసింహుడిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి !


J.SURENDER KUMAR,


2027 లో రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని  ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షించడానికి మంగళవారం ధర్మపురికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందుగా  శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు

మంత్రులతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్ హనుమంతరావు  జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు.

దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతొ మేల తాళాలతో స్వాగతం పలికిన పిదప దర్శన అనంతరం వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శ్రీ స్వామి వారి శేష వస్త్రం ప్రసాదం ఇచ్చి సన్మానించారు. జరిగింది.


👉 స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే !

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి  నిజామాబాద్ (అర్బన్)శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్త దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.