👉 IJU జాతీయ కార్యవర్గ సమావేశంలో సెమినార్ !
J.SURENDER KUMAR,
కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ప్రారంభమైన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) జాతీయ కార్యవర్గ సమావేశాల్ని పురస్కరించుకొని “జర్నలిజంకు మరియు వర్కింగ్ జర్నలిస్టులకు రక్షణ అవసరమా?” అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ది వైర్ మీడియా సంస్థ వ్యవస్థాపకులు సిధార్థ్ వరదరాజన్ లు ప్రసంగించారు.

బెంగుళూరు గేట్ హోటల్ లో ఆగస్టు 8,9 తేదీలలో జరుగుతున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) జాతీయ కార్యవర్గ సమావేశాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ది వైర్ మీడియా సంస్థ వ్యవస్థాపకులు సిధార్థ్ వరదరాజన్ లు శనివారం ప్రారంభించారు.


ఐజేయు అధ్యక్షులు బల్విందర్ సింగ్ జమ్ము అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మీడియా అకాడమీ చైర్మన్లు కె. శ్రీనివాస్ రెడ్డి, అంజూమ్ ఖన్నన్, ఐజేయు ప్రధాన కార్యదర్శి డి. సోమసుందర్, IJU జాతీయ మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, ఎస్.ఎన్. సిన్హాలతో పాటు 23 రాష్ట్రాల జర్నలిస్ట్స్ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జాతీయ కార్యవర్గం పాల్గొంది.
