మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తాం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


మహిళా సంఘాలను మరింత బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత తోడ్పాటు అందుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి మండలం నాగారం గ్రామంలో MGNREGS నిధుల ద్వారా సుమారు ₹ 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఇదే మండలంలో ని కమలాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ….

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పెద్ద పీట వేస్తుందని ఉచిత బస్సు ప్రయాణం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, నూతన మహిళా సంఘ భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానిక మహిళా సంఘాల కార్యకలాపాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

👉 ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి !

ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.