మా ప్రజా ప్రభుత్వంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

మా ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి మంత్రి ప్రారంభించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….


రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. ఇందులో భాగంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు రేషన్ కార్డులను అందజేస్తూ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.


👉 ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతన పెన్షన్లు పంపిణీ చేస్తుందని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.


👉 స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు చొరవ తీసుకొని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దరఖాస్తులు ప్రభుత్వానికి అందే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. అబ్బాపూర్ గ్రామ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని అబ్బాపూర్ పెరిక పల్లె రోడ్డు పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


👉 కాంగ్రెస్ రైతు పక్షపాతి..
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు !


కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఎలాంటి ఆలోచన లేకుండా చేపట్టిన రాజకీయ నిర్మాణంతో రైతులకు సాగునీరు అందడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలం లో నిర్మాణం చేసిన ప్రాజెక్టుల ద్వారానే సాగునీరు లభ్యమవుతుందని విజయ రమణారావు తెలిపారు. ఎలాంటి కోతలు లేకుండా రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రానున్న రోజుల్లో రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని విజయ రమణారావు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండు వెంకటేష్, జగిత్యాల జిల్లా గంధ్రాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, పీఏసీఎస్ చైర్మన్లు లోక జలపతి రెడ్డి, పుల్లూరి వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.