👉 చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి !
J.SURENDER KUMAR,
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన నిర్వహించారు, ఆస్తిత్వ పోరాటానికి ప్రతీక తెలంగాణ అని చైర్ పర్సన్ ప్రసంగంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ,మున్సిపల్ వైస్ ఛైర్మెన్ ఇందారపు రామయ్య కౌన్సిలర్లు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మహిళా సంఘాల కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.
👉 గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన !

పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో గోదావరి నది లో జరగనున్న గణేష్ నిమజ్జన ఘాట్లలో ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ ఎం. శ్రీనివాస్, వైస్ ఛైర్మెన్ ఇందారపు రామన్న , కౌన్సిలర్లు సంగి ఆనంద్ , చుక్క సంధ్య ,విద్యుత్ శాఖ అధికారులు, సిఐ రాం నరసింహ రెడ్డి , ఎస్ఐ సదాకర్ , కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు కలసి పరిశీలించారు.

నిమజ్జన సమయంలో భక్తులు, యువతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చే మార్గంలో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేలా చర్యలు చేపట్టారు.

నిమజ్జన దారిలో ప్రజలకు, భక్తులకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, ఘాట్ల వద్ద కూడా అవసరమైన లైటింగ్ తో పాటు గజ ఈతగాళ్లను నియమించాలని తదితర ముందస్తు భద్రత చర్యలు గూర్చి మీరు అధికారులకు పలు సూచనలు చేశారు.
👉 ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి అంగన్వాడీలది కీలకపాత్ర !

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా మూడేళ్లలోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారంపై అవగాహన కల్పించడం అభినందనీయమని మునిసిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి అన్నారు.
జగిత్యాల జిల్లా శిశు సంక్షేమా శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషణ మాసం కార్యక్రమం ధర్మపురి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో “సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8వరకు నిర్వహిస్తున్న, మండల స్థాయి 9వ పోషణ మాసం కార్యక్రమంలో చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ , సిడిపిఓ వాణిశ్రీ , ఏసీడిపిఓ మౌనిక , అంగన్వాడి కేంద్రాల సూపర్వైజర్లు, కార్యకర్తలు,ఆయాలు పాల్గొన్నారు.
..
