J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని పెద్దపెళ్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశి శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికిన పిదప స్వామి దర్శనం అనంతరం వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం తదుపరి దేవస్థానం పక్షాన శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ బహుకరించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ , స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు , సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి , ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసచారి , అర్చకులు నంబి నరసింహమూర్తి , నేరెళ్ల విజయ్ కుమార్, మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు .
