👉నారికేళాభి షేకం 51 చీరలతో అలంకారం !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ సూర్య ధన్వంతరి ధనలక్ష్మి సహిత దేవాలయంలో, చింత కుంట చెరువు దగ్గర, కుంకుమ పూజలు నారికేళాభి షేకంఅమ్మ వారికి 51 చీరలతో అంగరంగ వైభవంగా అలంకరించారు.
శ్రీ సూర్య ధన్వంతరి ధనలక్ష్మి సహిత దేవాలయం లో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి అధ్వర్యంలో శ్రావణ మాసంఅమా వాస్య శుక్రవారంఅమావాస్య పర్వదినం పురస్కరించుకొని, మాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన నారికేళాభిషేకం, లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.

పారాయణం అనంతరం మాతలు అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు. శ్రావణ మాసం సందర్భం గా .కుంకుమ పూజ అనంతరం లక్కీ డిప్ ద్వార ముగ్గురిని ఎంపిక చేసి వారికి బహుమతులు అలాగే అమ్మ వారి శేష వస్త్రం ప్రసాదం తాంబూలం ఆలయ పూజారి ఆశీర్వచనములతో బహుకరించారు.

ఆలయ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ వడ్లగట్ట రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్, మహిళా సభ్యులు వొడ్నాల లత, వడ్ల గట్ట స్వాతి, భారతాల గీత, సాయి రాణి, సంధ్య, భాగ్య లక్ష్మి, చంద్ర కళ, అవంతిక, గంగమ్మ, పద్మావతి, సుజాత, దివ్య, శిరిష, అంజలి, మాధురి, శిరిష, ‘ జమున,మనీత, గంగ జల, ప్రియాంక, సాయి ప్రసన్న, అర్చకులు శ్రీహరితదితరులు పాల్గొన్నారు.
