దిల్లీ యూనివర్సిటీ ఎన్నికల సత్తా చాటిన ఏబీవీపీ !

👉 అధ్యక్ష పదవితో పాటు రెండు పదవులు కైవశం !


J.SURENDER KUMAR,


దిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) 2026 ఎన్నికల్లో ఏబీవీపీ  సత్తా చాటింది. కీలకమైన అధ్యక్ష పదవితో పాటు  రెండు స్థానాలను కైవసం చేసుకుని మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

👉 అధ్యక్షుడిగా  పోటీ చేసిన ఏబీవీపీకి చెందిన యష్ దబాస్ 24,576 ఓట్ల సాధించి,  NSUI అభ్యర్థి విజయ్ శంకర్ విజయ్ మీనాపై దాదాపు 2,053 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

👉 ఈఎన్నికల్లో NSUI  అధ్యక్ష అభ్యర్థి మీనాకు 22,523 ఓట్లు వచ్చాయి. అలాగే ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన  చేసిన స్వతంత్ర అభ్యర్థి దీపాన్షు షోకీన్ ఘనవిజయం సాధించారు. ఆయన 30,615 ఓట్లతో ఏబీవీపీ అభ్యర్థి ఇషు మౌర్యపై ఏకంగా 13,705 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు.

👉 దిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి పోటీచేసిన ఏబీవీపీ అభ్యర్థి రియా ఛావ్‌ దీ.. 21,650 ఓట్లతో NSUI అభ్యర్థి  నమ్రతా చౌదరిపై 6,781 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ పదవికి  ABVP కు చెందిన లక్ష్య రాజ్ సింగ్ 16,641 ఓట్లతో ఇండిపెండెంట్ అభ్యర్థి విశేష్ యాదవ్ పై 863 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.

👉 ఈ ఎన్నికలకు సంబంధించి దిల్లీ హైకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాల మేరకు క్యాంపస్ లోపల లేదా బయట ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని ఎన్నికల అధికారులు గెలిచిన అభ్యర్థులకు, వారి మద్దతుదారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


👉దిల్లీ యూనివర్సిటీ వ్యాప్తంగా 52 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో 40.46 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలతో భారీ భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు. క్యాంపస్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో 2026-27 విద్యా సంవత్సరానికి గాను నూతన DUSU సెంట్రల్ ప్యానెల్ బాధ్యతలు చేపట్టనుంది. DUSU సెంట్రల్ ప్యానెల్ లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు.