👉 జగిత్యాల–కరీంనగర్–వరంగల్ రహదారిపై 2015లోనే నాడు ఎంపీగా పొన్నం ప్రభాకర్ చేసిన ప్రయత్నాలు !
👉 130 కి.మీ. 4-లేన్ అభివృద్ధికి NHAIకి అప్పగించినట్లు 2016లో కేంద్ర కార్యదర్శి స్పష్టీకరణ !
J. SURENDER KUMAR,
ఉత్తర తెలంగాణలో కీలకమైన జగిత్యాల–కరీంనగర్–వరంగల్ మార్గం జాతీయ రహదారిగా అభివృద్ధి చెందడంలో నాటి ఎంపీగా పొన్నం ప్రభాకర్ చేసిన ప్రయత్నాలు నాటి లేఖ నేటి నాలుగు లైన్లు బాటగా మారింది చర్చ నెలకొంది. ఎంపీగా ఉన్న సమయంలోనే పొన్నం ప్రభాకర్ ( ప్రస్తుత రాష్ట్ర మంత్రి) ఈ మార్గం ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు లేఖల ద్వారా విజ్ఞప్తి చేసినట్లు ఆయన కార్యాలయం పేర్కొంది.
👉 2016లో కేంద్రం నుంచి లేఖ !

👉 24 మే 2016న సంజయ్ మిత్ర, అప్పటి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పొన్నం ప్రభాకర్ కు రాసిన లేఖ.( ఫైల్ ప్రతి)

పొన్నం ప్రభాకర్ రాసిన లేఖలకు స్పందనగా 2016 మే 24న కేంద్ర రోడ్డు రవాణా శాఖ నుంచి అధికారిక లేఖ వచ్చింది. ఈ మార్గాన్ని NH-563గా అభివృద్ధి చేసే ప్రక్రియపై అందులో వివరాలు ఉన్నాయని ఆయన కార్యాలయం తెలిపింది. అనంతరం జగిత్యాల–కరీంనగర్–వరంగల్ మార్గంలో నాలుగు లైన్ల అభివృద్ధి పనులకు సంబంధించి NHAI స్థాయిలో ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి.
👉 వరంగల్–కరీంనగర్ పూర్తితో ముందడుగు !
NH-563లో వరంగల్–కరీంనగర్ భాగం పూర్తవడంతో ఉత్తర తెలంగాణలో రహదారి అనుసంధానం మరింత మెరుగుపడింది. మరోవైపు జగిత్యాల–కరీంనగర్ సెక్షన్‌ను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసే ప్రాజెక్టు NHAI రికార్డుల్లో నమోదైంది. అధికారిక పత్రాల్లో ఈ సెక్షన్‌కు 4-లేన్ అభివృద్ధి ప్రతిపాదనలు, ప్యాకేజీల వివరాలు ఉన్నాయి.
👉 పనుల వేగంపై మరోసారి దృష్టి !

జగిత్యాల–కరీంనగర్ మధ్య మిగిలిన పనులను వేగవంతం చేయాల్సిన అవసరంపై ప్రస్తుతం కూడా చర్చ కొనసాగుతోంది. గతంలో NH-563 అలైన్‌మెంట్‌కు సంబంధించి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లేఖ రాసిన విషయం కూడా నమోదైంది. నాటి అవసరాన్ని గుర్తించి చేసిన డిమాండ్.. నేడు జాతీయ రహదారి అభివృద్ధి రూపంలో ముందుకు సాగుతున్న పరిస్థితి.. NH-563 ప్రస్థానంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తోంది.
