వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి !

J . SURENDER KUMAR,


పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేసిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అభినందించారు.

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వైద్యులు డాక్టర్ డి. రమణ ధన్నపునేని , డాక్టర్ ఎం. అమరేష్ రావు  ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

క్యాంప్‌లోని 19 మంది చిన్నారుల్లో కేవలం 2 కిలోల బరువున్న రెండు నెలల పసికందుకు కూడా విజయవంతంగా శస్త్రచికిత్స చేయడంపై ముఖ్యమంత్రి వైద్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి , జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్  పాల్గొన్నారు.