దసరా వేడుకలలో పాల్గొన్న మంత్రి అడ్లూరి.!


J SURENDER KUMAR,


ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో మంగళవారం అంగరంగ వైభవంగా విజయదశమి  వేడుకలు జరిగాయి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేడుకలలో పాల్గొన్నారు.


ఉదయం  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం ఆలయం నుండి  స్వామివార్ల ఉత్సవ మూర్తులు మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో, వేద ఘోష ల తోఊరేగింపుగా అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపానగల జమ్మి గద్దె ప్రాంతానికి చేరుకున్నాయి.

అర్చకులు, వేద పండితులు, జమ్మి వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. పోలీసు అధికారులు విజయ సూచికగా గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. 

మంత్రి ముందుగా  జమ్మి వృక్షం నుండి ఆకులను తుంచారు. అనంతరం  స్వామివారి  ఊరేగింపుగా అంబేద్కర్, నంది చౌక్  నుండి ఆలయానికి చేరుకున్నాయి. స్థానిక బస్టాండ్ ప్రాంగణంలో రావణ దిష్టిబొమ్మను దహనం చేశారు


👉 మంత్రి నివాసంలో ఆయుధ పూజ…!


ధర్మపురి లోని మంత్రి  లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో వేద పండితులు ఆయుధ వాహన పూజలు నిర్వహించారు. విజయదశమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి  ఆకాంక్షించారు.