సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయుధ పూజ !

J. SURENDER KUMAR,


పవిత్ర విజయదశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ముఖ్యమంత్రి కి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

👉  స్వగ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి !

విజయ దశమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  కుటుంబ సమేతంగా తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్చకుల ఆశీర్వచనం స్వీకరించారు.

ముందుగా నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కి,  ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, గ్రామస్థులు పెద్దఎత్తున హాజరై ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీగా శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.