జగిత్యాల  కలెక్టరేట్లో లో బతుకమ్మ సంబరాలు!

👉 బతుకమ్మ ఆడిన కలెక్టర్ సత్య ప్రసాద్ …..!


  J .SURENDER KUMAR,

బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని బతుకమ్మ ఆడారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని  జ కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఈ సందర్భంగా అన్నారు. మహిళలు సమిష్టిగా బతుకమ్మ ఆడటం వల్ల సాంఘీక ఐక్యత బలపడుతుందని తెలిపారు.

తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేకమైన పేర్లతో బతుకమ్మ పండగ మహిళలు నిర్వహిస్తారని, ఈరోజు ఐదవ రోజు అట్ల బతుకమ్మ – అట్లు (దోశెలు) బతుకమ్మ – కాగా ప్రకృతి ప్రసాదించిన తంగేడు, గునగ, బంతి మరియు రంగు రంగుల పూలతో బతుకమ్మను అలంకరించి మహిళలు ఆట,పాటలతో పండుగ చేసుకోవడం నిజంగా కన్నులపండుగలా ఉందని
ఈ వేడుకల్లో పాల్గొనడం అనందంగా ఉందన్నారు.
అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
మహిళా అధికారులు,సిబ్బంది ఉత్సాహకంగా బతుకమ్మ పాటలు పడుతూ బతుకమ్మ ఆడారు.

మహిళలు బతుకమ్మ నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటలు, వాగుల వద్ద జాగ్రత్త వహించాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ నిమజ్జనం ఏర్పాట్లు చేసినట్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ, డిడబ్ల్యూవో భాస్కర్,మహిళా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

👉 మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ

జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా ఎన్. ప్రసూనాంబ బుధవారం బాధ్యతలు స్వీకరించగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్ప గుచ్చం అందించారు.

👉 స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్‌కు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు…

👉 ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.!

జగిత్యాల జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన బి. రాజ గౌడ్ సాధారణ బదిలీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీపై వెళుతున్న నేపథ్యంలో, ఆయనకు జగిత్యాల కలెక్టరేట్ లో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హాజరై బి. రాజ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లోనూ ప్రజలకు సమర్థవంతమైన సేవలందిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలో ఆయన నిర్వహించిన సేవలను కొనియాడారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ప్రసూనాంబ, జిల్లా రెవెన్యూ అధికారి కె. వై ప్రసాద్, ఆర్డీవో లు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొని బి. రాజ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మీయంగా సన్మానించారు.