కొండగట్టు హుండీ ఆదాయం ₹ 1.29 కోట్ల రూపాయలు !

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు  ఆంజనేయస్వామి హుండీ ఆదాయం ₹ 1,23,00,984-00 ( కోటి ఇరువది మూడు లక్షల తొమ్మిది వందల  ఏనుబై నాలుగు) వచ్చిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి అంజనా రెడ్డి, ప్రకటనలో పేర్కొన్నారు. హుండీలు లెక్కింపు లో వచ్చిన మిశ్రమ వెండి, బంగారము తిరిగి బ్యాగ్ లో వేసి సీల్ చేసి హుండీలో వేశామని  విదేశీ కరెన్సీ 68 నోట్స్ లభించినట్టు పేర్కొన్నారు.

ఆలయ ప్రాంగణంలో భారీ బందోబస్తు నిఘా నీడలో 76 రోజుల 14 హుండీ లు గురువారం జరిగిన లెక్కింపులో
శివ శక్తి సేవా సమితి మరియు శ్రీ శక్తి సేవా ట్రస్ట్ వారు పాల్గొన్నారు
దేవాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పర్యవేక్షకుడు రాజమౌళి పర్యవేక్షణలో . ఆలయ AEO గుండి హరిహరనాత్, సునీల్ కుమార్ పర్యవేక్షకులు ఆలయ ప్రధాన అర్చకులు మారుతి ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, పరిశీలకులు అశోక్, లక్ష్మారెడ్డి, ధర్మేందర్, శ్రీనివాస్ ఆలయ సిబ్బంది, ఏ.ఎస్.ఐ, మహిళా కానిస్టేబుల్, హెూంగార్డ్స్, బ్యాంక్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.