ధర్మపురి నరసింహుడి ఆదాయం 59 లక్షలు!


J.SURENDER KUMAR,

పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం  ₹ 59,97,771/-  నగదు మరియుమిశ్రమ బంగారము 42 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 400 గ్రాములు మరియు విదేశి నోట్లు 40 వచ్చాయి.

ఆలయ ప్రాంగణంలో బుధవారం (127) రోజులకు సంబందించినవి హుండీ లను ( 23-06-2026 నుండి 28-10-2026 వరకు)  విప్పి లెక్కించారు.

హుండీ  లెక్కింపు భారీ బందోబస్తు సీసీ కెమెరాలు నిఘా నీడలో జరిగాయి.   నాయిని సుప్రియ, సహాయ కమీషనర్, దేవాదాయశాఖ,  దేవస్థాన కార్యనిర్వహణాధికారి  .శ్రీనివాస్  ఉప ప్రధాన అర్చకులు నేరళ్ళ శ్రీనివాచార్యులు, సూపరింటెండెంట్.శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్  వి.తిరుపతి, మాజీ దేవస్థాన ధర్మకర్తలు  గునిశెట్టి రవీందర్ 

మరియు తిరుమల సేవా గ్రూప్ ఇంచార్జ్  రవీందర్ & సభ్యులు, కరీంనగర్, శ్రీవల్లి గ్రూప్, పెద్దపల్లి, మమతరెడ్డి గ్రూప్, కరీంనగర్ మరియు ధర్మపురి, లక్షేటిపేట సేవకులు, ఇతరులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మేనేజర్ & సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు దేవస్థాన అర్చకులు & సిబ్బంది, భక్తులు పాల్గోన్నారు.
.