J .SURENDER KUMAR,
ధర్మపురి అసెంబ్లీ పరిధిలో వెల్గటూర్ మండలంలోనీ కిషన్ రావు పేట గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొమురయ్య, శ్రీనివాస్ ల కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు.

అనంతరం గుండెపోటుతో మృతి చెందిన మొకనపెల్లి చంద్రయ్య, సప్ప తిరుపతి కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, కుటుంబాన్ని ఆదుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వారి కి మంత్రి హామీ ఇచ్చారు.
👉 అంబారిపేటలో….

మండలంలోనీ అంబారిపేట గ్రామానికి చెందిన గుండటి సుగుణమ్మ ఇటీవల మృతి చెందింది వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బుధవారం గుండె పోటుతో మృతి చెందిన ముడిమడుగుల రాజేశం మృతదేహా దేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్య ₹ 5 వేల ఆర్థిక సహాయం అందించారు. మంత్రి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
