👉 కేంద్రం మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా !
J.SURENDER KUMAR,
తెలంగాణ వేదికగా వచ్చే డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026’ అధికారిక లోగో, మస్కట్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు.
👉 ఢిల్లీలో కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి , రాష్ట్ర మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉 హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు స్టేడియాలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. 27 క్రీడాంశాల్లో 7 వేల మందికి పైగా క్రీడాకారులు తలపడనున్నారని తెలిపారు.
👉 మూడేళ్లలోనే రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ను ₹113 కోట్ల నుంచి ₹465 కోట్లకు పెంచినట్లు సీఎం గారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియాల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
