J SURENDER KUMAR,
కరీంనగర్ జిల్లా కేంద్రములో మహావీర్ జిమ్ 13వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు మహావీర్ బౌన్సర్స్ (ప్రొఫెషనల్ సెక్యూరిటీ సర్వీసెస్), మహావీర్ బాక్సింగ్ అకాడమీని ప్రారంభించారు.

యువత శారీరక దృఢత్వంతో పాటు క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి సంస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
