ఎదురుచూపులకు రేవంత్ సర్కార్ తెర!

👉 అధికారంలో ఉండగా ఒక డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు..!

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్..!


J.SURENDER KUMAR,

పింఛన్ కోసం అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు రేవంత్ సర్కార్ తెరదించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో వెల్గటూర్, ఎండపల్లి మండలాలకు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లు మంజూరి పత్రాలను వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ అందజేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నాలుగు గ్యారంటీలు అమలు చేశామని మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డు అందజేయడంతో పాటు సన్న బియ్యం సైతం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

👉 ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేయూత పింఛను అందించి అండగా నిలవాలని ఉద్దేశంతో కొత్త పింఛన్లు మంజూరు చేశారని అన్నారు. మండపల్లి మండలాలకు నూతనంగా 812 చేయూత పింఛన్లు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. మండలంలో అర్హత ఉన్న వారిని గుర్తించి పింఛన్లు విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.


👉 గత ప్రభుత్వ కాలంలో ఒకరికి డబ్బులు బెడ్ రూమ్ ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు. మండలంలో అర్హత ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ను అందజేస్తామని మంత్రి తెలిపారు. సంక్రాంతి తర్వాత నియోజకవర్గంలో ని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం మంత్రి తెలిపారు.

👉 అభివృద్ధి పనులకు శంకుస్థాపన..!

వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ రూపాయలు కోటి 83 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ప్రధాన రహదారి నుండి మార్కెట్ యార్డ్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేసి వెల్గటూర్ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి అడ్లూరి అన్నారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.