జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ?

J.SURENDER KUMAR,

సీఎం రేవంత్ రెడ్డి మే నెల మొదటి వారం లో జగిత్యాల

జిల్లాలో పర్యటించ నున్నట్టు సమాచారం.

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి , తాటిపర్తి జీవన్ రెడ్డి కి మద్దతుగా మే 1న కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నట్టు సమాచారం.

జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆయనకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.


సీఎం పర్యటన తేదీ, సమయము, రోడ్డు షో నా ? భారీ బహిరంగ సభ నా ? అనే అంశం ఖరారు కాలేదని తెలిసింది. కార్యక్రమ వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.