మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాల్ కు హరీష్ రావు మౌనం !

👉 హరీష్ రావు కోసం సిద్దిపేటలో మంత్రి లక్ష్మణ్ కుమార్ వెయిటింగ్..!

J.SURENDER KUMAR,

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చేసిన బహిరంగ సవాల్ కు హరీష్ రావు మౌనవహించారు. సిద్దిపేటలో, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ స్వీకరించడానికి రాక కోసం మంత్రి లక్ష్మణ్ కుమార్ గంటల తరబడి వెయిట్ చేశారు. మాజీమంత్రి హరీష్ రావు తమ క్యాబినెట్ సమావేశంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిజమైనవి అంటూ సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రమాణం చెయ్యాలని, లేదా తాను అవాస్తవాలంటూ ప్రమాణం చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ గత కొన్ని రోజుల క్రితం హరీష్ రావును సవాల్ చేశారు.

శనివారం సిద్ధిపేట కు చేరుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

👉 హరీష్ రావు రాక కోసం వేచి ఉన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..

స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం తీరును దండుపాళ్యం అనడం బాధాకరం అని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

👉 హరీష్ రావు ఉమ్మడి రాష్ట్రంలో 2004 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేసిన విషయం మరిచావా ? అంటూ ప్రశ్నించారు.

👉 మంత్రివర్గ సమావేశంలో ప్రజలకు ఉపయోగపడే అంశాలు చర్చించాము  తప్ప దండుపాళ్యం లాగా దోచుకోవడం కోసం మేము సమావేశం పెట్టలేదన్నారు.

👉 నాటి తెరాస, ప్రస్తుత బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో  ఎంత దోచుకున్నారో తెలంగాణ ప్రజలు చూసారు అని అన్నారు.

👉 ఒక మాజీ దళిత ఎమ్మెల్యేతో నన్ను బాధపెట్టే రకంగా తిట్టించడం బాధాకరం. స్థాయి గూర్చి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. నేను క్యాబినెట్ మంత్రిని, ప్రస్తుతం హరీష్ రావు ఎమ్మెల్యే మాత్రమే ఎవరి స్థాయి అయినా ఆ భగవంతుడు ప్రజలు నిర్ణయిస్తారు. నీ భజనమండలి తో నన్ను తిట్టాంచావు, అలా తిట్టించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

👉 తెలంగాణా ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా కీలకం…మేమే గొప్పవాళ్ళము…మా త్యాగాలే గొప్పవి అని మీ పార్టీ అనుకుంటే అది మీ మూర్కత్వం.

👉 మేము అధికారంలోకి వచ్చి 20 నెలలు మాత్రమే అవుతుంది. అధికారం లేక మమ్మల్ని ఓర్వలేక ఇలా టార్గెట్ చెయ్యడం పద్ధతి కాదు అన్నారు.

👉 2014 ఎన్నికల సమయములో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరా ? పార్టీ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రిని చేశారా ?  ఇంటికో ఉద్యోగం లాంటి హామీలు ఏమయ్యాయి ?

👉 మా ముఖ్యమంత్రిని, మంత్రులను ఏకవచనంతో, భూతులు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నారు.
మీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో వున్న పది సంవత్సరాల పాలనలో  ఒక్క నియామకపత్రం ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిరుద్యోగులకు ఇచ్చారా ?

👉 మీ పాలనలో  రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసారు…అయినా కానీ మేము అప్పులకు వడ్డీ చెల్లించుకుంటూ  అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలు పరుస్తున్నాము అన్నారు.

👉 మా పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలలకే మీరు బాకీ కార్డు అంటూ…నా నా హాంగామా చేస్తున్నారు…మీ హయాంలో మీరు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసాము అని గర్వంగా చెప్పే దమ్ము ఉందా ? హరీష్ రావు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ నిలదీశారు.


👉 హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 123 అడుగుల విగ్రహం వద్ద మీరు ఇచ్చిన హామీలు అమలు చేశామని  చర్చకు సిద్ధమా హరీష్ రావు ?

👉 చర్చకు మాజీ సీఎం కెసిఆర్ వస్తా అంటే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. చర్చకు నేనే వస్తాను అంటే నీతో నేను చర్చకు రావడానికి సిద్ధం తేదీ, సమయం మీరే నిర్ణయించండి హరీష్ రావు. ఎన్నికల సమయంలో ఏ పార్టీ అయినా ఇచ్చిన హామీలు నేరవేర్చకపొతే ప్రజలే బుద్ది చెపుతారు.

👉 42 శాతం బీసి రిజర్వేషన్  కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలి.

👉 నేను వివాదం చేయడానికి ఇక్కడికి రాలేదు. మాకు ఆస్తులు, ఫామ్ హౌస్ లు ముఖ్యం కాదు హరీష్ రావు. మా దళితులకు ఆత్మగౌరవం ముఖ్యం.

👉 జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, గ్రామస్థాయి,మండల స్థాయి, జిల్లా స్థాయి ఎన్నికలు ఉన్నాయి అందులో ప్రజలు ఎవరికీ బ్రహ్మరధం పడుతారో చూద్దాం.